విపణిలోకి జిందా తిలిస్మాత్‌ బామ్‌
close

Published : 24/10/2021 05:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విపణిలోకి జిందా తిలిస్మాత్‌ బామ్‌

హైదరాబాద్‌ (మాదాపూర్‌), న్యూస్‌టుడే: కార్ఖానా జిందా తిలిస్మాత్‌ సంస్థ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దేశ విపణిలోకి జిందా తిలిస్మాత్‌ బామ్‌ను  సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్లు సుహైలుద్దీన్‌ ఫారుఖీ, ఇమాదుద్దీన్‌ ఫారూఖీలు శనివారం ఇక్కడ ఆవిష్కరించారు. సుహైలుద్దీన్‌ ఫారుఖీ మాట్లాడుతూ వందేళ్లుగా జిందా తిలిస్మాత్‌ ఉత్పత్తులు ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాయన్నారు. ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో రూపొందించిన జిందా బామ్‌ తల, వీపు, ఛాతి, కండరాల నొప్పులను, ముక్కు కారడం, తుమ్ములను దూరం చేస్తుందన్నారు. శరీరం మీద బామ్‌ రుద్దిన కొద్ది సేపు మంట పుట్టినా, తదుపరి ఆ ప్రాంతాన్ని చల్లబర్చడం ఈ బామ్‌ ప్రత్యేకతన్నారు. విదేశాలకూ ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు. త్వరలోనే టూత్‌పేస్ట్‌, ఇన్‌హేలర్‌ను ూర్కెట్‌లోకి తెస్తామని ఇమాదుద్దీన్‌ ఫారూఖీ వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఉండగా, చేవెళ్ల ప్రాంతంలో మరొకటి ప్రారంభించే యోచన చేస్తున్నట్లు చెప్పారు. ఎగుమతికి ఆదరణ పెరిగితే దుబాయ్‌లో కూడా మరో కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. జిందా తిలిస్మాత్‌ ప్రచారకర్త, టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ తమ ఇంటిల్లిపాది జిందా తిలిస్మాత్‌ ఉత్పత్తులను చిన్నప్పటి నుంచి వాడుతున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని