పాన్‌తో ఆధార్‌ అనుసంధానం చేశారా?
close

Published : 18/06/2021 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాన్‌తో ఆధార్‌ అనుసంధానం చేశారా?

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ.. దానికి ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేయాల్సిందే. జూన్‌ 30 లోగా (ప్రస్తుత నిబంధనల ప్రకారం) ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే.. కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.
బ్యాంకింగ్‌ సేవలను పొందడం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు, యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇలాంటి సేవలన్నీ పొందాలంటే.. మీ పాన్‌ను ఆధార్‌ను జత చేయాల్సిందే. లేకపోతే.. ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది. దీంతోపాటు.. మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండు, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశమూ ఉండదు.
ఆదాయపు పన్ను శాఖ ఇటీవల మార్చిన నిబంధనల మేరకు ప్రతి జులై 1 నుంచి ప్రతి పాన్‌.. ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లేకపోతే ఆ పాన్‌ చెల్లదు. కాబట్టి, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) చేసేవారు ఇలాంటి పాన్‌ ఉన్న వారికి 20శాతం వరకూ పన్ను విధించాల్సి ఉంటుంది. అయితే టీడీఎస్‌ చేయని ఆదాయాలకు ఇది వర్తించదు. మీ పాన్‌ను ఆధార్‌తో జత చేసిన సమాచారాన్ని బ్యాంకులు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకూ సమాచారం ఇవ్వడమూ మంచిదే. జులై 1 తర్వాత ఆధార్‌ అనుసంధానం కాని పాన్‌ ఉన్న వారికి రూ.10వేల   జరిమానా విధించే అవకాశమూ ఉంది. కాబట్టి, వీలైనంత తొందరగా
www.incometax.gov.in పోర్టల్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయండి. ఇప్పటికే మీరు ఈ రెండింటినీ జత చేసుకున్నా.. మరోసారి ఇఫైలింగ్‌ వెబ్‌సైటులోకి వెళ్లి, తనిఖీ చేసుకోవడం మంచిది. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. పాన్‌, ఆధార్‌లో పుట్టిన తేదీ వేర్వేరుగా ఉంటే.. అనుసంధానం కుదరకపోవచ్చు. పేరులో తప్పులున్నా సాధ్యం కాదు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని