పీపీఎఫ్ డిపాజిట్ సౌకర్యాన్ని అందించనున్న మరిన్ని పోస్టాఫీసులు... - single hand sub post offices to offer PPF deposit facility
close

Updated : 01/01/2021 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీపీఎఫ్ డిపాజిట్ సౌకర్యాన్ని అందించనున్న మరిన్ని పోస్టాఫీసులు...

ప్రసిద్ధి పొందిన చిన్న పొదుపు పథకం అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి, ఈ పథకాన్ని సింగిల్ హ్యాండ్ సబ్ పోస్టాఫీసుల వరకు వెంటనే అమలులోకి తీసుకురావడానికి ఇండియా పోస్ట్ ఆమోదించింది.

పీపీఎఫ్ పథకాన్ని సింగిల్ హ్యాండెడ్ సబ్ పోస్ట్ కార్యాలయాలకు విస్తరించడానికి ఎప్పటికప్పుడు సూచనలు వచ్చాయి. ఇటీవల నోటిఫై చేసిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్, 2019 లో ఈ విషయాన్ని వివరంగా తెలిపింది, తదనుగుణంగా పీపీఎఫ్ పథకాన్ని సింగిల్ హ్యాండెడ్ సబ్ పోస్ట్ ఆఫీసుల వరకు వెంటనే అమలులోకి తీసుకురావడానికి అధారిటీ ఆమోదించిందని ఇండియా పోస్ట్ సర్క్యులర్‌లో తెలిపింది.

సబ్ పోస్టాఫీసుల తనిఖీ ఫారంలో అవసరమైన సవరణలను డైరెక్టరేట్ సంబంధిత శాఖ జారీ చేస్తుంది, దీని ద్వారా ఎలాంటి మోసం జరిగే అవకాశం లేదని సర్క్యులర్‌ తెలిపింది.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ దృష్ట్యా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ది పథకంతో సహా కొన్ని చిన్న పొదుపు పథకాలకు ప్రభుత్వం డిపాజిట్ నిబంధనలను సడలించింది. FY 20 కోసం డిపాజిట్ల చెల్లింపు గడువును జూన్ 30, 2020 వరకు పొడిగించింది. లాక్ డౌన్ కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి చేయని డిపాజిట్‌లకు ఇది వర్తిస్తుంది.

పీపీఎఫ్, సుకన్య సమృద్ది ఖాతాల చందాదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సాధారణ పద్ధతిలో డిపాజిట్ చేయడం కొనసాగించవచ్చు. చందాదారులు 2019-20 ఆర్థిక సంవత్సరం, 2020-21 ఆర్థిక సంవత్సరానికి వేర్వేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలి. అయితే, పీపీఎఫ్, సుకన్య సమృద్ది ఖాతాల్లో అసలు డిపాజిట్ తేదీ నుంచి వడ్డీ వర్తిస్తుంది. అలాగే, ఒకవేళ పీపీఎఫ్ చందాదారుల ఖాతాలు మార్చి 31, 2020 న మెచ్యూర్ అయినట్లయితే, ఇప్పుడు ఖాతాను జూన్ 30 వరకు పొడిగించుకోవచ్చు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని