బీమా సంస్థను మార్చుకోవచ్చా? - can we change the insurance company
close

Updated : 24/04/2021 09:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీమా సంస్థను మార్చుకోవచ్చా?

నేను ఆరేళ్ల క్రితం రూ.4 లక్షల ఆరోగ్య బీమా పాలసీని తీసుకున్నాను. ఇప్పుడు కంపెనీని మార్చుకోవాలని అనుకుంటున్నాను. దీనివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా?

- దేవేందర్‌

బీమా సంస్థను మార్చుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీ పాలసీ పునరుద్ధరణ తేదీకి 45 రోజుల ముందే పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకోవాలి. మంచి క్లెయిం చెల్లింపుల చరిత్ర ఉన్న బీమా సంస్థకు మీ పాలసీని మార్చుకోండి. అయితే, కొత్త బీమా సంస్థ వైద్య పరీక్షలను చేయించుకోవాల్సిందిగా కోరే అవకాశం ఉంది. బీమా సంస్థ విచక్షణ మేరకు పాలసీని ఇస్తారు. ముందస్తు వ్యాధులకు పరిహారం, నో క్లెయిం బోనస్‌లాంటి ప్రయోజనాలూ అందుతాయి.


నేను ఒకేసారి రూ.3లక్షలను పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. దీన్ని 15 ఏళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటాను. ఏ పథకాల్లో మదుపు చేస్తే మేలు. ఎంత మొత్తం జమ అవుతుంది?

- సుభాని

మీకు 15 ఏళ్ల వ్యవధి ఉందంటున్నారు కాబట్టి, మీ డబ్బుకు మంచి రాబడి రావడానికి డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు ఉత్తమం. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠం నుంచి 9శాతం వరకూ తక్కువగా ఉన్నాయి. రూ. 3లక్షలను 15 ఏళ్లపాటు కొనసాగిస్తే.. దాదాపు 13 శాతం రాబడితో..రూ.18,76,281 అయ్యేందుకు అవకాశం ఉంది. కనీసం నాలుగు ఫండ్లలో మంచి పనితీరున్న ఫండ్లలో మదుపు చేయండి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని