close

Updated : 20/03/2021 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రవాసుల పెట్టుబడులు దేశీయ పెట్టుబడులే: డీపీఐఐటీ

దిల్లీ: ఏదైనా భారతీయ కంపెనీలో ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) పెట్టే పెట్టుబడులను దేశీయ పెట్టుబడులుగా పరిగణిస్తామని పారిశ్రామిక ప్రోత్సాహకాలు, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) స్పష్టం చేసింది. విదేశీ పరోక్ష పెట్టుబడుల లెక్కింపులో వీటిని దేశీయ పెట్టుబడులుగానే లెక్కవేస్తామని తెలిపింది. నాన్‌-రిపాట్రియేషన్‌ పద్ధతిపై ప్రవాసుల నియంత్రణ ఉండే భారత కంపెనీల్లోకి వచ్చే పెట్టుబడులకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విధానాన్ని ప్రభుత్వం సమీక్షించిందని డీపీఐఐటీ తెలిపింది. నాన్‌-రిపాట్రియేషన్‌ పద్ధతిలో భారత్‌లోని కంపెనీలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఏవైనా విక్రయాలు జరిగితే అవి భారత్‌ వెలుపలకు వెళ్లడానికి వీలుండదు. ప్రవాసులు పెట్టే పెట్టుబడులపై స్పష్టత ఇవ్వడం కోసం ఎఫ్‌డీఐ విధానంలో ఒక క్లాజును ఆ మేరకు జత చేసినట్లు ఆ విభాగం వివరించింది. ఈ నిర్ణయం ఫెమా నోటిఫికేషన్‌ తేదీ నుంచి అమల్లోకి రానుందని డీపీఐఐటీ తెలిపింది.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని