Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్, నేను నా 24వ ఏట నుంచి జీవన్ సరళ్ పాలసీ లో 10 ఏళ్లుగా రూ. 30 వేల వార్షిక ప్రీమియం చెల్లిస్తున్నాను. ఇప్పుడు పాలసీ సరెండర్ చేసి కొన్ని అప్పులు తీర్చాలనుకుంటున్నాను. ఇది మంచిదేనా?

Asked by KP on
మీరు పేర్కొన్న పాలసీ ఒక ఎండోమెంట్ పధకం. ఇందులో బీమా హామీ, పెట్టుబడి కలిపి ఉంటాయి. అయితే, బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. ఇలాంటి పాలసీల నుంచి దూరంగా ఉండడం మంచిది. మీరు ఎల్ఐసి ని సంప్రదించి పాలసీ సరెండర్ చేయడం మేలు.   జీవిత బీమా కావాలంటే ఒక టర్మ్ బీమా పాలసీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.   పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్(పదవీ విరమణ నిధి కోసం) లాంటి పధకాలు ఎంచుకోవచ్చు. దీర్ఘకాలం లో కొంత రిస్క్ తీసుకోగలిగితే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మదుపు చేయవచ్చు. సిప్ విధానంలో ఒక ఇండెక్స్ ఫండ్ లో మదుపు చేయండి. యూటీఐ నిఫ్టీ ఇండెక్స్  డైరెక్ట్ ఫండ్ ఎంచుకోవచ్చు.   

మరిన్ని

మీ ప్రశ్న