Questionfullstory News, Headlines, Breaking News, Articles
close

నిపుణులు ఇచ్చిన సమాధానాలు

Facebook Share WhatsApp Share Telegram Share Link Share

హాయ్ సిరి , నేను ఇటీవలే పాలసీ బజార్ నుంచి TATA AIA ఆన్లైన్  పాలసీ తీసుకున్నాను . నెలసరి ప్రీమియం రూ. 10000. 7 ఏళ్ళు చెల్లించాలి. పాలసీ 15 ఏళ్ళకి పూర్తవుతుంది. ఏజెంట్ ప్రకారం 15 ఏళ్ళకి రూ. 40 లక్షలు వస్తాయి. నిజంగా 40 లక్షలు వస్తాయా? నేను పాలసీ బజార్ వెబ్సైటు లో పాలసీ తీసుకోవడం మంచిదేనా . దయచేసి చెప్పగలరు.

Asked by nagarjuna on
పాలసీ బజార్ వెబ్సైటు లో పాలసీ  తీసుకోవడం మంచిదే. అయితే, మీరు పాలసీ పూర్తి పేరు తెలుపలేదు. ప్రతి కంపెనీ లో అనేక బీమా పాలసీ లు ఉంటాయి. సాధారణంగా, ఎండోమెంట్, మనీ బ్యాక్ లాంటి పాలసీలలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువే. మీరు తెలిపిన వివరాల ప్రకారం మీరు ఏడాదికి రూ.1.20 లక్షలు, అంటే 7 ఏళ్ళకి సుమారుగా రూ. 8.40 లక్షల వరకు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలాంటి పాలసీలలో 4-5 శాతం వరకు రాబడి ఉండే అవకాశం ఉంది. కాబట్టి, 6 శాతం ప్రకారం రాబడి అంచనా వేసుకున్నట్టయితే 15 ఏళ్ళ తరవాత మీరు సుమారుగా రూ. 15 లక్షల వరకు పొందే అవకాశం ఉంది. జీవిత బీమా కోసం అయితే మీరు టర్మ్ పాలసీ ఎంచుకోవచ్చు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి.  మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. పెట్టుబడి కోసం పీపీఎఫ్, ఎన్పీఎస్ (పదవీ విరమణ నిధి కోసం), మ్యూచువల్ ఫండ్స్ లాంటి పధకాలు ఎంచుకోవచ్చు.  

మరిన్ని

మీ ప్రశ్న