అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు పండగే.. - 9 films to debut on Amazon Prime within 3 months
close
Updated : 09/10/2020 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు పండగే..

అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ ముగిసేవరకు ఓటీటీలో 9 చిత్రాల విడుదల

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని అనేక ప్రాంతాల్లో మరికొద్దిరోజుల్లో సినిమా థియేటర్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటీటీ మాధ్యమం అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు తీపి కబురు తెలిపింది. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ ముగిసేవరకు ఏకంగా 9 సినిమాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అందులో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సూర్య చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’తోపాటు ఆనంద్‌ దేవరకొండ ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ సహా పలు చిత్రాలు ఉన్నాయి. 

తమిళంలో సూర్య, అపర్ణ బాలమురళి కలిసి నటించిన ‘సూరరాయ్‌ పోట్రు’ (తెలుగులో ఆకాశమే నీ హద్దురా) ఏప్రిల్‌ 9వ తేదీనే విడుదల కావాల్సింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈనెల 30వ తేదీన రిలీజ్‌కు సిద్ధమైంది. విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ చిత్రం మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పలు బాలీవుడ్‌ చిత్రాలు కూడా అమెజాన్‌ ప్రైం వేదికగా విడుదలకు సిద్ధమయ్యాయి. 1995 బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన గోవిందా, కరిష్మాకపూర్‌ కలిసి నటించిన కూలీ నం.1 చిత్రాన్ని డేవిడ్‌ ధావన్‌ రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్‌, సారా అలీఖాన్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరణ్‌ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమాను క్రిస్మస్‌‌ సందర్భంగా డిసెంబర్‌ 25న ఓటీటీలో విడుదల చేయనున్నారు. అక్షయ్‌కుమార్‌ నిర్మాతగా.. భూమి ఫెడ్నేకర్‌ నటించిన దుర్గావతి చిత్రం డిసెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క నటించిన తెలుగు చిత్రం భాగమతిని బాలీవుడ్‌లో దుర్గావతిగా రిమేక్‌ చేశారు. రాజ్‌కుమార్‌రావు నటించిన ‘ఛలాంగ్’ నవంబర్‌ 13న విడుదలకు సిద్ధమయ్యింది. 

మలయాళంలో భారీ హిట్‌ సాధించిన దుల్కర్‌ సల్మాన్‌, పార్వతి కలిసి నటించిన ‘చార్లీ’ సినిమాని తమిళ్‌లో ‘మారా’ పేరుతో రీమేక్‌ చేశారు. మాధవన్‌, శ్రద్ధా శ్రీనాథ్ కలిసి నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 17న రిలీజ్‌ కానుంది. 

వీటితోపాటు కన్నడ చిత్రాలు ‘భీమసేన నలమహారాజ’ అక్టోబర్‌ 29, ‘మన్నె నంబర్‌13’ నవంబర్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌ విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకున్నాయి. మలయాళ కామెడీ చిత్రం ‘హలాల్ లవ్‌స్టోరీ’ ఈనెల 15వ తేదీన విడుదల కానుంది. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని