ముంబయి: 90 శాతం కేసులు ఆ ప్రాంతాల్లోనే! - 90 pc covid patients in mumbai in past 2 months from high rises
close
Updated : 12/03/2021 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయి: 90 శాతం కేసులు ఆ ప్రాంతాల్లోనే!

ముంబయి: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. అయితే ముంబయిలో ఫిబ్రవరి నుంచి నమోదవుతోన్న కేసుల్లో 90 శాతం పాజిటివ్‌ కేసులు ఉన్నత వర్గాలు నివాసం ఉంటున్న ప్రాంతాల నుంచే వస్తున్నాయని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మిగిలిన పది శాతం కేసులు మురికివాడలు, స్కాల్స్‌లలో నమోదవుతున్నట్లు వివరించారు. ఫిబ్రవరి, జనవరిలలో ముంబయిలో దాదాపు 23,002 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 90 శాతం కేసులు ఉన్నత వర్గాలు నివశించే ప్రాంతాలు, 10 శాతం కేసులు ఇతర ప్రాంతాల్లో వచ్చినట్లు అధికారులు వివరించారు.

గత కొద్ది రోజులుగా ముంబయిలో మహమ్మారి విజృంభించడంతో మురికివాడలలో కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీనిలో మధ్య, వెనకబడిన తరగతుల వారు కరోనా బారిన పడుతున్నట్లు ముంబయి సీనియర్‌ వైద్యుడు చెప్పారు. ఇప్పటివరకు నగరంలో 27 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. మరికొన్ని భవనాలకు రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మురికి వాడలలో కూడా కేసులు పెరిగిపోతుండటంతో  కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అసిస్టెంట్ మున్సిపల్ కమిషన్‌ సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని