రషీద్‌ఖాన్‌ హెలికాఫ్టర్‌ షాట్‌ చూశారా? - Afghanistan Batsman Rashid Khan hits helicophter shot
close
Updated : 25/07/2020 12:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రషీద్‌ఖాన్‌ హెలికాఫ్టర్‌ షాట్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో ఎన్ని షాట్లున్నా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఆడే హెలికాఫ్టర్‌ షాట్లే వేరు. వాటికుండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. బ్యాట్‌ను గుండ్రంగా తిప్పుతూ బంతిని స్టాండ్స్‌లోకి తరలించడం చూస్తే అభిమానులకు కనుల విందు. అలాంటి హెలికాఫ్టర్‌ షాట్లు ఎవరాడినా ప్రత్యేకమే. తాజాగా అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌, సన్‌రైజర్స్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ అదే షాట్‌ ఆడి అలరించాడు. కాకపోతే అతడు ఆడింది క్రికెట్‌ బంతితో కాకుండా టెన్నిస్‌ బంతితో. లో ఫుల్‌టాస్‌ వచ్చిన బంతిని అమాంతం లాంగ్‌ ఆన్‌లోకి సంధించాడు. ఆ వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అభిమానులు తెగ లైక్‌ చేస్తున్నారు.

అలాగే రషీద్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు తీసుకురావాలని, ఈ సారి సన్‌రైజర్స్‌ ఛాంపియన్‌గా నిలుస్తుందని పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇన్ని రోజులు కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్‌ పదమూడో సీజన్‌కు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈలో నిర్వహించనున్నట్లు ఆ టోర్నీ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ శుక్రవారం వెల్లడించారు. మరోవైపు 2017 నుంచి ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఆడుతున్న రషీద్‌ జట్టులో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 46 మ్యాచ్‌లు ఆడగా 55 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని