ఆలీ సీక్రెట్స్‌ బయటపెడతానన్న వినాయక్‌..! - Alitho Saradaga Latest Promo Ali with VV Vinayak
close
Published : 16/10/2020 02:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలీ సీక్రెట్స్‌ బయటపెడతానన్న వినాయక్‌..!

ఎన్టీఆర్‌ చేతికి గాయం.. కంగారు పడ్డా: దర్శకుడు

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆది’ చిత్రంతో మాస్‌, కమర్షియల్‌ డైరెక్టర్‌ వెండితెరకు పరిచయమయ్యారు వి.వి.వినాయక్‌. మొదటి చిత్రంతోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్న ఆయన.. ఆ తర్వాత అగ్ర కథానాయకులతో ఎన్నో వాణిజ్య చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజాగా ఆయన ‘ఈటీవీ’లో ప్రసారమవుతున్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేశారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వినాయక్‌ పంచుకున్నారు.

కాగా, త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌లో తాను డైరెక్టర్‌ అవ్వడానికి గల కారణాన్ని వినాయక్‌ వెల్లడించారు. ‘ఆది’ సినిమా షూటింగ్‌ సమయంలో చోటుచేసుకున్న ఓ ప్రమాదం గురించి వివరిస్తూ.. ఓ ఎమోషనల్‌ సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ మణికట్టుపై గాయమైందని రక్తం బాగా కారిందని.. భయంతో తారక్‌ని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఆ గాయం చూసిన వైద్యుడు..‘మణికట్టు వద్ద చాలా సున్నితమైన నరం ఉంటుంది. ఏదైనా అయితే నా ప్రాణం పోతుంది’ అని కంగారు పెట్టేశాడని వినాయక్‌ అన్నారు. అది చిన్న విషయం కాదని.. ఇప్పటికీ ఆ గాయం గుర్తు తారక్‌ చేతిపై ఉంటుందని ఆయన వివరించారు. అనంతరం ఆలీకి సంబంధించిన రెండు సీక్రెట్స్‌ బయటపెడతానని అన్నారు. దీంతో ఆలీ-వినాయక్‌ మధ్య సరదా సంభాషణలు చోటుచేసుకున్నాయి. ఇదిలాఉండగా, ఎంతో సరదాగా సాగుతోన్న ఎపిసోడ్‌లో ఆలీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ వినాయక్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆలీ గురించి వినాయక్‌ బయటపెట్టిన సీక్రెట్స్‌ ఏంటి? దర్శకుడు ఎమోషన్‌ అవ్వడానికి గల కారణమేమిటి? ‘చెన్నకేశవరెడ్డి’ ఆశించిన విజయం అందుకోకపోవడానికి కారణం? ఇలా అనేక విషయాలు తెలియాలంటే వచ్చే సోమవారం వరకూ వేచి చూడాల్సిందే. అక్టోబర్‌ 19న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ ప్రోమో చూసేయండి..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని