‘సైరా’ దర్శకుడితో అఖిల్‌..! - Announcing my next with Surender reddy tweeted akhil
close
Published : 09/09/2020 23:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సైరా’ దర్శకుడితో అఖిల్‌..!

బ్లాక్‌బస్టర్‌ పక్కా అంటున్న నిర్మాత

హైదరాబాద్‌: యువ కథానాయకుడు అక్కినేని అఖిల్‌ తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. ‘సైరా’తో ఇటీవల హిట్‌ అందుకున్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ విషయాన్ని అఖిల్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. అనిల్‌ సుంకర ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు తెలిపారు. ‘ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. త్వరలో షూటింగ్‌ ఆరంభించడానికి సిద్ధమౌతున్నా. ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ‘ఈ బ్లాక్‌బస్టర్‌ను రూపొందించాలని చాలా ఉత్సుకతగా ఉంది. ఈ కాంబినేషన్‌ ప్రతి ఒక్కరి అంచనాల్ని అధిగమిస్తుంది. మనకు ఆల్‌ ది వెరీ బెస్ట్‌’ అని అనిల్‌ సుంకర ఆనందం వ్యక్తం చేశారు.

‘అఖిల్‌’తో అరంగేట్రం చేసిన అఖిల్‌ ఆపై ‘హలో’, ‘మిస్టర్‌ మజ్ను’తో అలరించారు. ప్రస్తుతం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌’లో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. భాస్కర్ దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని