కేకేఆర్‌ 10, సీఎస్కే 10, డీసీ 6 ఇంకా.. - CSK KKR dc to carry exclusive net bowlers to UAE
close
Published : 11/08/2020 19:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేకేఆర్‌ 10, సీఎస్కే 10, డీసీ 6 ఇంకా..

(చిత్రం: ఐపీఎల్‌ ట్విటర్‌ నుంచి..)

దిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2020ని యూఏఈకి తరలించడంతో ఫ్రాంచైజీలు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాయి. వారం రోజులుగా బసకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. తాజాగా ఆటగాళ్లు కాకుండా ఎంత మంది సహాయ సిబ్బందిని అక్కడికి తీసుకెళ్లాలో యాజమాన్యాలు దృష్టి సారించాయి. కోచింగ్‌ బృందం, నెట్‌బౌలర్లను ఎంపిక చేస్తున్నాయి.

గతంలో ఇక్కడే లీగ్‌ జరిగేది కాబట్టి నెట్‌బౌలర్ల సమస్య ఉండేది కాదు. ఇప్పుడు జట్టుకు 24 మందినే బీసీసీఐ పరిమితి విధించడంతో వీరిని ప్రత్యేకంగా తీసుకెళ్లాలని ఫ్రాంచైజీలు యోచిస్తున్నాయి. చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పది మందిని, దిల్లీ క్యాపిటల్స్‌ ఆరుగురిని తీసుకువెళ్తాయని సమాచారం. ఆర్‌సీబీ అండర్‌-19 కుర్రాడు ఆదిత్య ఠాక్రే వంటి బౌలర్లను తీసుకొనే అవకాశం ఉంది.

సాధారణంగా మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు సాధన చేస్తారు. మ్యాచ్‌లో ఆడే బౌలర్లే పూర్తిగా బంతులు వేయరు. అలాచేస్తే వారు అలసిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో నెట్‌బౌలర్లు ఉపయోగపడతారు. రంజీ, అండర్‌-19, అండర్‌-23 జట్లలో ఆడుతున్న బౌలర్లను ఇందుకోసం ఎంచుకుంటారు. టీమ్‌ఇండియా యువపేసర్‌ నవదీప్‌ సైని అలా వచ్చినవాడే.

లీగ్‌ విజయవంతంగా కొనసాగడానికి, ఆటగాళ్లు సురక్షితంగా ఉండేందుకు నెట్‌బౌలర్లను సైతం పూర్తిగా బయో బబుల్‌కే పరిమితం చేస్తారు. దానిని దాటికి బయటకు వెళ్లేందుకు వీల్లేదు. నిబంధనలన్నీ కఠినంగా పాటించాల్సి ఉంటుంది. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ముగింపు వరకు వీరక్కడే ఉంటారని తెలిసింది. నెట్ ‌బౌలర్లలో పేసర్లతో పాటు స్పిన్నర్లకూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎందుకంటే యూఏఈలో ఉష్ణోగ్రతలు ఎక్కువ. దుబాయ్‌, అబుదాబి, షార్జా పిచ్‌లు మందకొడిగా ఉంటాయి. స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని