ప్రదీప్‌కి పూర్ణ కండిషన్‌..! - Dhee Champions Latest Promo
close
Published : 12/10/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రదీప్‌కి పూర్ణ కండిషన్‌..!

కారణమేంటో తెలుసా..

హైదరాబాద్‌: అమ్మాయిలతో మాట్లాడొద్దని వ్యాఖ్యాత ప్రదీప్‌కి నటి పూర్ణ షరతు పెట్టారు. అయితే అది నిజ జీవితంలో కాదు కేవలం ఓ స్కిట్‌ కోసం మాత్రమే. ప్రియమణి, బాబా భాస్కర్‌ న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ షో ‘ఢీ ఛాంపియన్స్‌’. సుడిగాలి సుధీర్‌, రష్మి, హైపర్‌ ఆది, వర్షిణి ఈ షోలో టీమ్‌ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సుధీర్‌-రష్మి, ఆది-వర్షిణిలకు యూట్యూబ్‌ జోడీలుగా పేరు ఉన్న విషయం తెలిసిందే. సరికొత్త యూట్యూబ్‌ జోడీగా పూర్ణా-ప్రదీప్‌ మారారని ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌లో ప్రియమణి సరదాగా చెప్పారు.

కాగా, త్వరలో ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ‘నువ్వంటేనే ఇష్టం.. నువ్వు కాదంటేనే కష్టం’ అంటూ రాజు చేసిన పర్ఫామెన్స్‌కి జడ్జిలందరూ ఫిదా అయ్యారు. సూపర్‌గా ఉందని కామెంట్లు ఇచ్చారు. అనంతరం సుధీర్‌తో కలిసి తేజు.. ‘ముసుగు వెయోద్దు మనసు మీద..’ సాంగ్‌కి డ్యాన్స్‌ చేయగా.. సెట్‌లో ఉన్నవాళ్లందరూ అవాక్కయ్యారు. గత కొన్ని ఎపిసోడ్స్‌ నుంచి సుధీర్‌పై ఫన్నీగా కామెంట్లు చేసిన బాబాభాస్కర్‌ మాస్టర్‌ సైతం.. సదరు టీమ్‌ లీడర్‌ని ‘నువ్వు బెస్ట్‌ రా’ అంటూ ప్రశంసించారు.

డ్యాన్స్‌ షోలో భాగంగా గెలిచిన టీమ్‌ లీడర్స్‌ ఓడిపోయిన టీమ్‌ లీడర్స్‌కి సరదాగా టాస్క్‌లు ఇవ్వడం ‘ఢీ’లో కొన్ని సీజన్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఎపిసోడ్‌లో టాస్క్‌ కోసం పూర్ణా, ప్రదీప్‌ దంపతులుగా వ్యవహరిస్తారు. వారి ఇంట్లో అద్దె కోసం రష్మి, వర్షిణి, సుధీర్‌, ఆది ప్రయత్నాలు చేస్తారు. అయితే అమ్మాయిలకి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి అంగీకరించిన పూర్ణా.. ‘ఇల్లు అద్దెకు ఇస్తా కానీ మీరు వాళ్లతో మాట్లాడకూడదు. వాళ్లు కూడా మీతో మాట్లాడకూడదు.’ అని ప్రదీప్‌కి ఓ కండిషన్‌ పెడుతుంది. ఒకపక్క నవ్వులు పూయిస్తూనే మరోపక్క క్వాటర్‌ ఫైనల్‌కి ఎవరు అడుగుపెట్టనున్నారో అనే టెన్షన్‌తో ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన ‘ఢీ ఛాంపియన్స్‌’ ఎపిసోడ్‌ చూడాలంటే వచ్చే బుధవారం వరకూ వేచి చూడాల్సిందే. అక్టోబర్‌ 14న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో చూసేయండి..!!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని