2 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపు  - England won by 2 runs against Australia in the first T20 match
close
Updated : 05/09/2020 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపు 

ఆస్ట్రేలియాతో ఉత్కంఠగా సాగిన తొలి టీ20..

 (ఫొటో: క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ తర్వాత తిరిగి క్రికెట్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ బయోబుడగలో విజయవంతంగా మ్యాచ్‌లను నిర్వహిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ జట్లపై విజయం సాధించిన ఆ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాపైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. గతరాత్రి ఇరు జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత ఆస్ట్రేలియా గెలిచేలా కనిపించినా ఇంగ్లిష్‌ బౌలర్లు సరైన సమయంలో చెలరేగి పర్యాటక జట్టును కట్టడి చేశారు. 

తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయించింది. అయితే, జాస్‌ బట్లర్‌(44; 29 బంతుల్లో 5x4, 6x2), మలాన్‌(66; 43 బంతుల్లో 5x4, 6x3) ఎదురు తిరిగి ఆడారు. వీరిద్దరు మినహా ఇంగ్లాండ్‌లో ఏ ఒక్కరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. అయినా, ప్రత్యర్థి ముందు 163 పరుగుల లక్ష్యం ఉంచారు. ఛేదనకు దిగిన ఆసీస్‌ జట్టుకు శుభారంభం దొరికింది. తొలి వికెట్‌కే డేవిడ్‌ వార్నర్‌(58; 47 బంతుల్లో 4x4), ఆరోన్‌ ఫించ్‌(46; 32 బంతుల్లో 7x4, 1x6) 98 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే 14 ఓవర్లకు 124/1తో ఉన్న ఆ జట్టు చివరికి ఓవర్లన్నీ పూర్తయ్యేసరికి 160/6తో సరిపెట్టుకుంది. ఓపెనర్లు ఔటయ్యాక స్టీవ్‌స్మిత్‌(18), మార్కస్‌ స్టోయినిస్‌(23) గెలిపించాలని చూసినా కీలక సమయంలో వికెట్లు కోల్పోయారు. చివరి 3 ఓవర్లలో 26 పరుగులు చేయాల్సి ఉండగా, స్టోయినిస్‌ అప్పటికి క్రీజులో ఉండడంతో ఆసీస్‌ గెలుస్తుందని అనుకున్నారు. అయితే, టామ్‌ కరన్‌, జోర్డాన్‌ కట్టుదిట్టంగా బంతులేసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఈ క్రమంలోనే ఫైనల్‌ ఓవర్‌లో కంగారూ జట్టుకు 15 పరుగులు అవసరం కాగా, 12 పరుగులే చేసి ఓటమిపాలైంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని