భజ్జీ ఔట్‌చేస్తే చాలు.. ఫీల్డర్లు ఏదో అనేవాళ్లు - Gilchrist says whenever Harbhajan used to dismiss him Indian Players use to say a word
close
Updated : 07/08/2020 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భజ్జీ ఔట్‌చేస్తే చాలు.. ఫీల్డర్లు ఏదో అనేవాళ్లు

టీమ్‌ఇండియాపై ఆడంగిల్‌క్రిస్ట్‌ ఏమన్నాడంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఆటగాళ్లపై టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించేవాడు. 2001 నుంచీ అతడికది అలవాటుగా మారింది. తన వైవిధ్యమైన దూస్రాలతో వారిని కంగారు పెట్టించేవాడు. అలాంటి దిగ్గజం తనని ఔట్‌ చేసినప్పుడల్లా టీమ్‌ఇండియా ఫీల్డర్లు ఏదో అనేవారని ఆ జట్టు మాజీ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ చెప్పాడు. తాజాగా ‘లైవ్‌కనెక్ట్‌’ కార్యక్రమంలో పాల్గొన్న గిల్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

భారత్‌తో ఆడేటప్పుడు తాను పరుగులు చేస్తుంటే టీమిండియా ఆటగాళ్లు ఏమనేవారు కాదని, కానీ.. భజ్జీ బౌలింగ్‌లో ఔటయితే మాత్రం ఎప్పుడూ ఒక మాట అంటుండేవారని డెక్కన్‌ ఛార్జర్స్‌ మాజీ ప్లేయర్‌ చెప్పాడు. ఆ మాటేంటో తనకు తెలియదని, అది పలకడం కూడా తనకు రాదన్నాడు. అలాగే తాను భారత్‌లో పర్యటించేటప్పుడు మంచి ఆతిథ్యం లభిస్తుండేదని గుర్తుచేసుకున్నాడు. ఒకసారి ముంబయిలో ఉదయాన్నే లేచి ఎవరూ గుర్తు పట్టకుండా గాగుల్స్‌, టోపీ, ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని జాగింగ్‌కు వెళితే స్థానికులు గుర్తుపట్టారని.. కొద్ది దూరం వెంటపడి, తనతో ఫొటోలు తీసుకొనేందుకు ఆసక్తి చూపారన్నాడు. అది తనకు మధుర జ్ఞాపకమని పేర్కొన్నాడు.

‘భారత్‌లో మళ్లీ ఎప్పుడు అడుగుపెడతానో తెలియదు కానీ, అక్కడికి రావడానికి చాలా ఆశగా ఎదురు చూస్తున్నా’నని గిల్లీ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, గిల్‌క్రిస్ట్‌ ఐపీఎల్‌లో గతంలో డెక్కన్‌ ఛార్జెర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. తన నేతృత్వంలో రెండో సీజన్‌ 2009లోనే జట్టును టైటిల్‌ విజేతగా నిలబెట్టాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని