ఓనం వేడుక: కీర్తి సురేశ్‌ ఫొటో షూట్‌ - Keerthy Suresh special photo shoot on onam
close
Published : 01/09/2020 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓనం వేడుక: కీర్తి సురేశ్‌ ఫొటో షూట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓనం సందర్భంగా కథానాయిక  కీర్తి సురేశ్‌ కేరళ సంప్రదాయ దుస్తుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు, కీర్తి ప్రత్యేకంగా కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. సంప్రదాయ వస్త్రాలంకరణలో కీర్తి మరింత మెరిసిపోతోందంటూ అభిమానులు లైక్‌ల మీద లైక్‌లు కొడుతున్నారు.

లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి కీర్తి సురేశ్‌ ఇంటికే పరిమితం అయింది. ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతూ వ్యాయామాలు చేస్తూ, అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా ఓనం సందర్భంగా దిగిన ఫొటోలను సైతం షేర్‌ చేసింది.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా కీర్తి సురేశ్‌ నటించిన ‘పెంగ్విన్‌’ ఓటీటీ వేదికగా విడుదల కాగా, మరో చిత్రం ‘మిస్‌ ఇండియా’ కూడా విడుదలకు సిద్దంగా ఉంది. దీన్ని కూడా ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు యోచిస్తున్నారు. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సిఉంది. నరేంద్ర నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, నవీన్‌ చంద్ర, రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌ తదితరులు  ప్రధాన పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం కీర్తి చేతిలో మూడు చిత్రాలున్నాయి. ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘రంగ్‌దే’, ‘అన్నాత్తే’ చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. దీంతో పాటు, మహేశ్‌ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాటలో’ కూడా కీర్తి సురేశ్‌ నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని