చిత్రపరిశ్రమకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర - MP Jaya Bachchan has given Zero Hour notice in Rajya Sabha to Discuss defame the film industry
close
Updated : 15/09/2020 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్రపరిశ్రమకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర

దిల్లీ: డ్రగ్స్‌ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని చిత్రసీమను తప్పుపట్టడం సరికాదని సీనియర్‌ నటి, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌ అన్నారు. చిత్రపరిశ్రమను డ్రగ్స్‌ వ్యవహారం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు దర్యాప్తులో డ్రగ్స్‌ కోణం బయటపడింది. దీంతో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్‌సీబీ) అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. అప్పటి నుంచి చిత్రపరిశ్రమలోని పలువురిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై  ఎంపీ జయాబచ్చన్‌ స్పందించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. చిత్రపరిశ్రమకు చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు రాజ్యసభలో జీరో అవ‌ర్ నోటీసు ఇచ్చారు. 

‘‘కొందరి కోసం చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తప్పుపట్టడం సరికాదు. సోషల్‌మీడియా సినీ పరిశ్రమను చెడుగా చిత్రీకరిస్తోంది. ఇండస్ట్రీ సాయంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న కొంతమంది వ్యక్తులు ఇప్పుడు దానిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిన్న లోక్‌సభలో ఒక ఎంపీ సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా మాట్లాడటం శోచనీయం. గతంలో చిత్రసీమలో పనిచేసిన ఆ వ్యక్తి అలా మాట్లాడటం సిగ్గుచేటు. దీన్ని నేను ఖండిస్తున్నా. అలాంటి వ్యక్తులు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా’’ అని జయా బచ్చన్‌ అన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని