ఇప్పటివరకూ చేయని ఆసక్తికర పాత్ర - Nani shyam singha roy goes sets
close
Published : 22/12/2020 11:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పటివరకూ చేయని ఆసక్తికర పాత్ర

హైదరాబాద్‌: నాని కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. వెంకట్‌ ఎస్‌.బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ తాజాగా మొదలైంది. కథానాయకుడు నాని, కథానాయిక కృతిశెట్టిపై టాకీ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం కథానాయకుడు నాని ప్రత్యేకంగా సన్నద్ధమై, తన లుక్‌ని కూడా మార్చుకున్నారు.

‘‘ప్రతిభగల బృందం కలిసి చేస్తున్న చిత్రమిది. అన్ని భద్రతా చర్యలు తీసుకుంటూ చిత్రీకరణని మొదలు పెట్టాం. ప్రకటించిన రోజు నుంచి ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు చేయని ఆసక్తికరమైన పాత్రని నాని చేస్తున్నార’’ని చిత్రవర్గాలు తెలిపాయి. రాహుల్‌ రవీంద్రన్‌, మురళీశర్మ, అభినవ్‌ గోమటం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని