పార్టీలకు సెల్‌లు కాదు..టాలెంటే ముఖ్యం  - Not in favour of having cells in party on caste basis says Gadkari
close
Published : 30/11/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పార్టీలకు సెల్‌లు కాదు..టాలెంటే ముఖ్యం 

కేంద్రమంత్రి , భాజపా సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ

నాగ్‌పూర్‌: రాజకీయ పార్టీలు కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా విభాగాలు(సెల్‌) ఏర్పాటుకు తాను అనుకూలం కాదని కేంద్రమంత్రి , భాజపా సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ అన్నారు. వీటికన్నా ప్రతిభ ముఖ్యమని తెలిపారు.  తూర్పు విదర్భలోని భాజపా పట్టభద్రుల అభ్యర్థి సందీప్‌ జోషీకి మద్దతుగా ఆయన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. మనిషి కులం వల్ల గొప్పవాడు కాలేడని, ప్రతిభ వల్లే అవుతాడనేది తన అభిప్రాయమన్నారు. భాజపాలోనూ వేర్వేరు సెల్‌లు ఉన్నాయని.. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ అనుభవం ఎదురైందన్నారు.

కులాలు, మతాలు, వర్గాల ఆధారంగా ఎలాంటి విభాగాలు ఏర్పరచకూడదనేది తన అభిప్రాయమని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. పార్టీ, కార్యకర్తలే తమ కుటుంబమన్నారు. ఎప్పుడూ కులాలు, వర్గాల ప్రాతిపదికన రాజకీయం చేయలేదని చెప్పారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అండగా ఉంటాం.. వాళ్లను కుటుంబ సభ్యులుగా పరిగణిస్తాం.. ఇదే భాజపా ప్రత్యేకత అని చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని