కరోనా టీకా: అంతేనా.. అసలు నొప్పే లేదు! - Pentagon chief receives covid vaccine viral video
close
Published : 15/12/2020 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా టీకా: అంతేనా.. అసలు నొప్పే లేదు!

వ్యాక్సిన్‌ వేయించుకున్న అమెరికా రక్షణ మంత్రి

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ అధ్యాయానికి ముగింపు పలికే దిశగా.. అమెరికాలో అతిపెద్ద సామూహిక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫైజర్‌ ఉత్పత్తి చేసిన టీకాను మొట్టమొదటగా నర్సు శాండ్రా లిండ్సే తీసుకున్నారు. ఇక తొలి విడత టీకాను వేయించుకున్న ప్రముఖుల జాబితాలో అగ్రరాజ్య రక్షణ విభాగం పెంటగాన్‌ చీఫ్‌ క్రిస్టఫర్‌ మిల్లర్‌ కూడా చేరారు. అంతేకాకుండా ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవటాన్ని ప్రోత్సహించేందుకు, అపోహలు తొలగించేందుకు తాను టీకా వేయించుకుంటున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. నగరంలోని ఇక్కడి వాల్టర్‌ రీడ్‌ సైనిక ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకున్న మిల్లర్‌ .. ‘‘అంతేనా?! అబ్బా.. అసలు నొప్పే లేదు!‘‘ అనే సరదా వ్యాఖ్యానాన్ని వీడియోకు జత చేశారు.

మిల్లర్‌తో సహా అత్యున్నత స్థాయి సైనికాధికారులు స్వచ్ఛందంగా టీకా తీసుకుంటారని పెంటగాన్‌ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా  టీకా ప్రభావం, భద్రతల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే క్రమంలో భాగంగా.. అధికారులు టీకా తీసుకుంటున్న వీడియోలను ప్రజలు చూసేందుకు షేర్ ‌చేస్తారని కూడా తెలిపింది. ఇక కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న అమెరికాలో మూడు లక్షలకుపైగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ దేశ చరిత్రలోనే అతిపెద్దదైన టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించిన అగ్రరాజ్యం.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చే క్రమంలో వైద్యారోగ్య సిబ్బందికి పెద్ద పీట వేస్తోంది.

ఇవీ చదవండి..

అమెరికాలో నర్సుకు తొలి కొవిడ్‌ టీకా

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని