తన డైలాగ్‌లు తానే రాసుకోనున్నారా? - Rajinikanth may write his own punch dialogues in Annaatthe
close
Published : 13/10/2020 15:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తన డైలాగ్‌లు తానే రాసుకోనున్నారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌. ప్రస్తుతం ఆయన శివ దర్శకత్వంలో ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి, ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇందులో రజనీ ఒక గ్రామ సర్పంచ్‌గా కనిపిస్తారని టాక్‌. ఆయన ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌లకు ఇందులో కొదవ లేదట. ఈ నేపథ్యంలో ఆ పంచ్‌డైలాగ్‌లన్నీ రజనీనే స్వయంగా రాసుకోవాలని నిర్ణయించుకున్నారట. గత కొన్ని వారాలుగా దర్శకుడు శివతో కలిసి ఈ విషయమై చర్చలు కూడా జరిపారని టాక్‌. ప్రస్తుతం నిర్మాతలు ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో సెట్‌ను నిర్మిస్తున్నారు. కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ జాకీ ష్రాఫ్‌ ఇందులో ప్రతినాయకుడి కనిపించనున్నారట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని