‘సూర్య40’లో రష్మిక మందన..? - Rashmika Mandanna got a chance in Suriya 40
close
Updated : 23/11/2020 08:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సూర్య40’లో రష్మిక మందన..?

చెన్నై: గతేడాది రెండు భారీ హిట్లు కొట్టిన రష్మిక మందన దక్షిణాదిన బిజీ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలకు ఓకే చెప్పింది కూడా. ఇదిలా ఉండగానే.. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా తర్వాతి సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందట. ‘ఆకాశమే నీ హద్దురా’లో తన మార్కు నటన చూపించి విమర్శల ప్రశంసలు సైతం అందుకున్నాడు సూర్య. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూనే.. మరో సినిమాకు ఓకే చెప్పేశాడు. పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం సూర్యకు 40వ సినిమా. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. 
కాగా.. ఇప్పటికే ‘సుల్తాన్‌’ సినిమాకు సంతకం చేసిన రష్మిక తమిళంలో తెరంగేట్రాన్ని ప్రకటించింది. అందులో హీరో కార్తితో ఈ అమ్మడు హీరోయిన్‌గా రొమాన్స్‌ చేయనుంది. గతేడాది రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘భీష్మ’ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టడంతో పాటు అందరి ప్రశంసలు అందుకున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ కన్నడ భామకు డిమాండ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం కన్నడలో ‘పొగరు’, తమిళంలో ‘సుల్తాన్‌’, తెలుగులో అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇప్పటి వరకూ ఈ ముద్దుగుమ్మకు తెలుగు చలో, గీతా గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని