నాన్న వ్యాయామం చేస్తున్నారు: ఎస్పీ చరణ్‌ - SP Balasubrahmanyam health update
close
Published : 14/09/2020 18:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాన్న వ్యాయామం చేస్తున్నారు: ఎస్పీ చరణ్‌

చెన్నై: కరోనా వైరస్‌తో పోరాడుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారు. ఎస్పీబీ ఆరోగ్యం మరింత మెరుగుపడినట్టు ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ వెల్లడించారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగైనట్లు ఎక్స్‌రేలో కనిపించిందన్నారు. 20 నిమిషాల పాటు కూర్చొని వ్యాయామాలు చేస్తున్నారని చెప్పారు. ఫిజియోథెరఫిస్టులు ఆయనతో వ్యాయామాలు చేయిస్తున్నారని చరణ్‌ వివరించారు. 

కరోనా వైరస్‌ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని