ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్‌ - Sonu Sood mortgages 8 Juhu properties reports
close
Published : 09/12/2020 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్‌

ముంబయి: ప్రముఖ నటుడు సోనూసూద్‌ తన ఆస్తుల్లో కొన్నింటిని తాకట్టు పెట్టారట. ఆయన లాక్‌డౌన్‌ సమయం నుంచి నిస్సహాయుల్ని ఆదుకుంటూ పేదల పాలిట ఆపద్బాంధవుడిగా మారిన సంగతి తెలిసిందే. ప్రత్యేక బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి.. వలస కార్మికుల్ని స్వస్థలాలకు పంపించడం నుంచి పేదల విద్య, వైద్య ఖర్చులు కూడా భరిస్తున్నారు. అడిగిన వారికి కాదనకుండా తనవంతు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నెటిజన్లు ఆయన్ను రియల్‌ హీరోగా కొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనూ రూ.10 కోట్ల విరాళం పోగుచేయడానికి ముంబయిలోని జుహూలో గల తన ఎనిమిది ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు సమాచారం. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ఫ్లాట్లు ఉన్నాయట.

సెప్టెంబరు 15న అగ్రిమెంట్లపై సంతకం చేశారని, నవంబరు 24న రిజిస్ట్రేషన్‌ జరిగిందని సమాచారం. ‘ఎదుటివారి కోసం ఇలాంటి పని చేసిన వాళ్లను నేను ఇంత వరకు చూడలేదు’ అని వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్‌ హెడ్ రితేష్‌ మెహతా ఈ సందర్భంగా మీడియాతో చెబుతూ ఆశ్చర్యపోయారు. దీనిపై సోనూ సూద్‌ స్పందించాల్సి ఉంది.

ఇవీ చదవండి..
రైతులు.. ఆహారాన్ని అందించే సైనికులు
సాయికుమార్‌తో నేనెప్పుడూ అలా అనలేదు!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని