రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపాలి - Statements by BJP leaders on farmers protest unfortunate says Gehlot
close
Updated : 14/12/2020 23:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపాలి

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌

జైపుర‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలపై భాజపా నేతలు కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మండిపడ్డారు.  రైతులను కించపరిచేలా వారు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమంటూ తీవ్రంగా ఖండించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం త్వరగా స్పందించి పరిష్కారం చూపాలంటూ ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. 

‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతుల పట్ల భాజపా నాయకులు కించ పరిచే వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా దురదృష్టకరం. రైతుల్ని దేశ ద్రోహులతో పోల్చడానికి బదులుగా.. ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ డిమాండ్ల పరిష్కారం దిశగా కృషి చేయాలి. రైతులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వ్యవహరించడం ఆందోళన కలుగజేస్తోంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనం చేకూర్చవు. వాటిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని గహ్లోత్‌ డిమాండ్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని