ధోని రిటైర్మెంట్‌: సుశాంత్‌ వీడియో వైరల్‌ - Sushant Singh Rajput old videogoes viral after MS Dhoni announces retirement
close
Published : 17/08/2020 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ధోని రిటైర్మెంట్‌: సుశాంత్‌ వీడియో వైరల్‌

ముంబయి: అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత అందరూ ఆయన సేవలను కొనియాడుతున్నారు. ధోని భవిష్యత్‌ మరింత ఉజ్వలంగా ఉండాలని సామాజిక మాధ్యమాల వేదికగా కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలీవుడ్ నటుడు సుశాంత్‌ అభిమానులు మాత్రం ఒకింత ఆవేదన చెందుతున్నారు. ధోని బయోపిక్‌ ‘ఎంఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’లో సుశాంత్ టైటిల్‌ రోల్‌ పోషించి, అందరి ప్రశంసలూ అందుకున్నాడు. ఇటీవలే ఆయన ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్‌ సినీ ప్రేక్షకులను కలచి వేసింది. ధోని రిటైర్మెంట్‌ సమయంలో సుశాంత్‌ ఉండి ఉంటే మరో రకంగా ఉండేందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. ధోని బయోపిక్‌లో సుశాంత్‌ నటించిన తర్వాత తన సోదరీమణులతో కలిసి దిగిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సుశాంత్‌ ఐదుగురు సోదరీమణులు ఆయన చుట్టూ కూర్చొని ఉండగా సరదాగా మాట్లాడుకుంటున్న వీడియో అలరిస్తోంది. ధోని బయోపిక్‌లో తమ తమ్ముడు నటించినందుకు వారంతా గర్వపడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది.

2016 సెప్టెంబరు 16న విడుదలైన ‘ఎం.ఎస్‌.ధోని:ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. నీరజ్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌ టైటిల్‌ రోల్‌ పోషించగా, దిశా పటానీ, కియారా అడ్వాణీ, భూమిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని