నేనెలా చేస్తానోనని భయపడ్డా - Telugu News Actress NabhaNatesh Latest Interview On Maestro
close
Updated : 13/09/2021 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేనెలా చేస్తానోనని భయపడ్డా

‘‘రీమేక్‌ అనగానే కచ్చితంగా పోలికలు వస్తుంటాయి. కథని, నటీనటులు పోషించే పాత్రల్ని మాతృకతో పోల్చి చూస్తుంటారు. కాబట్టి ఒరిజినల్‌  వెర్షన్‌లోని అందాన్ని చెడగొట్టకుండా.. మనదైన శైలిలో సరికొత్తగా చూపించడం అటు దర్శకుడికి, ఇటు నటీనటులకు సవాలే’’ అంది నటి నభా నటేష్‌. తొలి దశ కరోనా తర్వాత వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేసిన ఆమె.. ఇప్పుడు రెండో దశ తర్వాత ‘మాస్ట్రో’తో వస్తోంది. నితిన్‌ హీరోగా నటించిన చిత్రమిది. మేర్లపాక గాంధీ దర్శకుడు. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 17న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది నభా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

‘‘అంధాధూన్‌’ బాలీవుడ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ లాంటి చిత్రం. అప్పట్లో దీని పేరు చాలా వినిపించింది. అలాంటిది ఈ చిత్ర రీమేక్‌లో నాకు అవకాశం రావడంతో చాలా ఆనందంగా అనిపించింది. అయితే మొదట్లో నాకు కాస్త భయంగానూ అనిపించింది. ఎందుకంటే మాతృకలో రాధికా ఆప్టే అద్భుతంగా నటించింది. ఆ పాత్రని నేనెలా చేయగలను? అని భయపడ్డా. తెలుగు సినిమా ప్రారంభించడానికి ముందు మాతృక చూసినా.. తర్వాత మళ్లీ చూడకూడదనుకున్నా. ఎందుకంటే ఆ ప్రభావం నా నటనపై పడుతుంది’’


‘‘ఇది రీమేక్‌ అయినా దర్శకుడు తన విజన్‌తో సినిమాని చాలా కొత్తగా తీశారు. ప్రేక్షకులకి ఓ తెలుగు చిత్రం చూస్తున్న అనుభూతే కలుగుతుంది. నా పాత్ర విషయంలోనూ ఎన్నో మార్పులు చేశారు. అంధుడిగా నితిన్‌ అద్భుతంగా నటించారు. మా ఇద్దరి సన్నివేశాలు, పాటలు బాగా వచ్చాయి. తమన్నా నాకెంతో సహకరించింది. ఈ చిత్రానికి నేనే డబ్బింగ్‌ చెప్పాలి అనుకున్నా. కానీ, కరోనా పరిస్థితుల వల్ల కుదర్లేదు. తర్వాతి సినిమాల్లో తప్పకుండా నా సొంత గళమే వినిపిస్తా’’.


‘‘ఇది వరకు నుంచే నాకు ఓటీటీ భయం ఉండేది. కరోనా సమయంలో నా రెండు సినిమాలు థియేటర్లలోనే విడుదలయ్యాయి. ఇప్పుడొస్తున్నది మూడోది. కానీ, ఈసారి ఓటీటీలోకి రావడం తప్పలేదు. ఇంకా థియేటర్ల సమస్య అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలో అయితే అందరూ చూసే వీలు కలుగుతుంది. నేను చేసే ప్రతి సినిమా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉండేలా చూసుకుంటా. నటిగా నాకు అన్ని రకాల జానర్లు, పాత్రలు చేయాలనుంది. భవిష్యత్‌ ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించే వరకు  చెప్పలేను’’.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని