మాస్‌ జాతర - Telugu News First Single From PUSHPA Out Now
close
Updated : 14/08/2021 07:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్‌ జాతర

పల్లవి :
ఎలుతురు తింటది ఆకు
ఆకును తింటది మేక
మేకను తింటది పులి
ఇది కదరా ఆకలి..
పులినే తింటది సావు
సావును తింటది కాలం
కాలాన్ని తింటది కాళీ
ఇది మహా ఆకలి
ఏటాడేది ఒకటి... పరిగెత్తేది ఇంకొకటి
దొరికిందా అది సస్తాది... దొరక్కపోతే ఇది సస్తాది
ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే
దాక్కో.. దాక్కో మేక... పులొచ్చి కొరుకొద్ది పీక

చరణం 1 :
చేపకు పురుగు ఎర
పాముకు గుడ్డు ఎర
ఏట కుక్కకు మాంసం ముక్క ఎర
మడుసులందరికి బతుకే ఎర
గంగమ్మ తల్లి జాతర
కోళ్లు పొట్టేల్ల కోతర
కత్తికి నెత్తుటి పూతరా
దేవతకైనా తప్పుదు ఎర
ఇది లోకం తల రాతరా..
ఏమరు పాటుగ ఉన్నావా..
ఎరకే చిక్కేస్తావు.. బలి అవుతావు..
ఎరనే మింగే ఆకలుంటేనే
ఇక్కడ బతికుంటావు
కాలేకడుపు సూడదు నీతీన్యాయం
బలమున్నోడిదే ఇక్కడ ఇష్టారాజ్యం
దాక్కో.. దాక్కో... మేక
పులొచ్చి కొరుకుద్ది పీక

చరణం 2 :
అడిగితె పుట్టదు అరువు
బతిమాలితె బతుకే బరువు
కొట్టర ఉండదు కరువు
దేవుడికైనా దెబ్బే గురువు
తన్నుడు చేసే మేలు
తమ్ముడు కూడా చెయ్యడు
గుద్దుడు చెప్పే పాఠం
బుద్దుడు కూడా చెప్పడు...


ఆహార గొలుసు... తత్వం కలిపి రాశా

‘‘పాటను కొత్తగా రాయాలనే తపన ఎప్పుడూ నాలో ఉంటుంది. అలా చేసిన మరో కొత్త ప్రయోగం ‘పుష్ప’ చిత్రంలోని ‘దాక్కో.. దాక్కో మేక’ పాట. ఈ మధ్య నేను రెండు మూడు గంటల్లోనే పాటలు రాస్తున్నా. ఈ పాటకు మాత్రం ఒక్కో వాక్యం పూర్తిచేయడానికి రోజుల తరబడి మధనపడ్డా. జీవశాస్త్రంలోని ఆహార గొలుసును... జన సామాన్యంలోని తత్వాన్ని మేళవించి అల్లిన చరణాలివి. ‘‘ఇందులోని ప్రతి పదమూ పుష్పరాజ్‌ పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించాలి. సినిమా కథలోని మూల విషయాన్ని చెప్పాలి’’ అని దర్శకుడు సుకుమార్‌ చెప్పారు. ఆయన అందించిన ఇన్‌పుట్స్‌, పాట వచ్చే సందర్భం నన్ను ఎంతోగానే స్ఫూర్తిపొందేలా చేశాయి. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. అది అద్భుతమంతే. కొత్త ప్రయోగానికి ఎలాంటి స్పందన వస్తోందనని ఉదయం నుంచి ఫోన్‌ ఆఫ్‌ చేశా. మా అబ్బాయి వచ్చి... నాన్న పాటకు మంచి రివ్వ్యూస్‌ వస్తున్నాయని చెప్పడంతో మొబైల్‌ ఆన్‌ చేశా. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రోత్సాహం, ఉత్సాహంతో మరిన్ని మంచి పాటలు తెలుగు సినిమా ప్రేక్షకులకు అందిస్తా.’’

- ‘పుష్ప’ తొలిపాట విడుదల సందర్భంగా చంద్రబోస్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని