నాగ్‌ పుట్టినరోజున... - Telugu News King Nag Next Movie First Look Launch On His Birthday
close
Updated : 28/08/2021 07:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాగ్‌ పుట్టినరోజున...

నాగార్జున కథానాయకుడిగా శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాజల్‌ కథానాయిక. ప్రవీణ్‌ సత్తారు  దర్శకత్వం వహిస్తున్నారు. నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పూస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్‌ చిత్రాలని ఇష్టపడే ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేలా, భారీ స్థాయి యాక్షన్‌ హంగులతో రూపొందిస్తున్నారు. నిర్మాత సునీల్‌ నారంగ్‌ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ సినిమా ప్రి లుక్‌ని విడుదల చేశారు. ఆగస్టు 29న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించనున్నట్టు చిత్రబృందం తెలిపింది. అయితే ప్రి లుక్‌లో రక్త కారుతున్న కత్తిని చేత పట్టుకుని ఓ వ్యక్తి కనిపిస్తున్నారు. అది నాగ్‌ లుక్‌ అనే స్పష్టమవుతోంది. 29న పూర్తిస్థాయి లుక్‌ని విడుదల చేసే అవకాశాలున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని