అక్షయ్‌ నటనకు ఆమీర్‌ ఫిదా - This Will Be Huge Aamir Khan Loves The Trailer Of Akshay Kumars Laxmmi Bomb
close
Published : 17/10/2020 23:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్షయ్‌ నటనకు ఆమీర్‌ ఫిదా

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు-తమిళ భాషల్లో విజయవంతమైన ‘కాంచన’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం లక్ష్మీబాంబ్‌. అక్షయ్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనా ఇంకా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తూనే ఉంది. తాజాగా ఈ ట్రైలర్‌ చూసిన బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌.. అక్షయ్‌ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ప్రియమైన అక్షయ్ కుమార్‌. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది మిత్రమా. నేను సినిమా ఎప్పుడు విడుదల అవుతుందోనని ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కావాలని కోరుకుటున్నాను. నువ్వు అద్భుతంగా నటించావు. చిత్ర బృందం అందరికీ నా శుభాకాంక్షలు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు  అక్షయ్‌ కుమార్‌ స్పందించారు.  ‘‘ప్రియమైన ఆమీర్‌ఖాన్‌. మా చిత్రం థియేటర్‌లలో విడుదల కావడం లేదు. ఇటువంటి బాధాకరమైన సమయంలో మాకు మద్దతుగా నిలిచినందుకు, నువ్వు దయతో చెప్పిన మాటలకు కృతజ్ఞతలు. నా హృదయాన్ని టచ్‌ చేశావు మిత్రమా ’’అని చెప్పారు. నవంబర్‌ 9న డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికగా ‘లక్ష్మీబాంబ్‌’ విడుదల కాబోతుంది.


     
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని