కరోనా వచ్చిందని యువకుడి ఆత్మహత్య! - a guy suicide in his home while being isolation
close
Published : 31/07/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వచ్చిందని యువకుడి ఆత్మహత్య!

కమలాపురం (కడప): కరోనా పాజిటవ్‌ అని నిర్థరణ కావడంతో 22 ఏళ్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కమలాపురం మండలంలోని రాజుపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నాలుగు రోజుల క్రితం జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఆ యువకుడికి ఉండడంతో కరోనా పరీక్షలకు రాజుపాలెం ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకున్నాడు. బుధవారం వెలువడ్డ ఫలితాల్లో ఆ యువకుడికి కరోనా పాజిటవ్ అని నిర్థరణ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ యువకుడిని హోం ఐసొలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. గురువారం కమలాపురంలో కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని బస్సు రాగా ఆ యువకుడి తల్లిదండ్రులు బస్సు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కమలాపురం ఎస్సై రాజా రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని