TMC: దీదీ మేనల్లుడికి కీలక పదవి - abhishek banerjee appointed general secretary of tmc
close
Updated : 06/06/2021 11:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TMC: దీదీ మేనల్లుడికి కీలక పదవి

కోల్‌కతా: పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో కీలక పదవి దక్కింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్‌ నియమితులయ్యారు. బెంగాల్‌లో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్టీ వర్కింగ్‌ కమిటీ తొలి సమావేశంలో అభిషేక్‌ పేరును మమత ప్రతిపాదించగా.. పార్టీ ఆమోదం తెలిపింది. డైమండ్‌ హార్బర్‌ ఎంపీ అయిన అభిషేక్‌ బెనర్జీ ప్రస్తుతం యూత్‌వింగ్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుభ్రతా భక్షి వ్యవహరిస్తున్నారు.

పార్టీలో ఒక పదవి ఒకరికే అన్న నిబంధన నేపథ్యంలో యూత్‌ వింగ్‌ బాధ్యతల నుంచి అభిషేక్‌ వైదొలగనున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత, మంత్రి పార్థ ఛటర్జీ మీడియాకు తెలిపారు. భక్షి స్థానాన్ని అభిషేక్‌ భర్తీ చేయనుండగా.. యూత్‌ వింగ్‌ అధ్యక్షురాలిగా నటి సాయోనీ ఘోష్‌ వ్యవహరించనున్నారు. వీరితోపాటు పార్టీకి చెందిన ఇతర విభాగాలకు కూడా అధిపతుల్ని నియమించారు. ఎన్నికల ముందు పార్టీని వీడి మళ్లీ పార్టీలోకి రావాలనుకుంటున్న వారి గురించి సమావేశంలో చర్చించలేదని ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు ఛటర్జీ సమాధానమిచ్చారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని