మరో ఇద్దరు తారలకు కరోనా - actress sameera and actor aatharva test positive for covid
close
Published : 18/04/2021 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో ఇద్దరు తారలకు కరోనా

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకీ తీవ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు దాని బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు సినీ తారలకు కొవిడ్‌ సోకింది. తమకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలియజేస్తూ కోలీవుడ్‌ నటుడు ఆధర్వ, నటి సమీరా రెడ్డి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.

స్వల్ప లక్షణాలు: ఆధర్వ

‘కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యులు సూచన మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. కొవిడ్‌ నుంచి కోలుకుని అతి త్వరలో మిమ్మల్ని అలరించేందుకు వస్తానని ఆశిస్తున్నా’ అని ఆధర్వ ట్వీట్‌ చేశారు.


ధైర్యంగా ఉండాలి: సమీరా రెడ్డి

‘శనివారం నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మేము ఆరోగ్యంగానే ఉన్నాం. దేవుడి దయ వల్ల అత్తయ్యకు నెగెటివ్‌ వచ్చింది. ప్రస్తుతానికి మేము ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స పొందుతున్నాం. మరింత ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి’ అని సమీరా రెడ్డి తాజాగా పోస్ట్‌ పెట్టారు.

మరోవైపు చిత్రపరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పరేశ్‌ రావల్‌, ఆమిర్‌ఖాన్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మాధవన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, భూమి ఫెడ్నేకర్‌, అక్షయ్‌కుమార్‌, విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌, నివేదా థామస్‌, దిల్‌రాజు, పవన్‌కల్యాణ్‌, బండ్ల గణేశ్‌, సోనూసూద్‌ తదితరులు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో కొంతమంది కరోనా నుంచి కోలుకున్నారు కూడా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని