‘ఆకాశవాణి’ నేడే విడుద‌ల కావాల్సింది.. కానీ.. - akashavani postponed
close
Published : 04/06/2021 15:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆకాశవాణి’ నేడే విడుద‌ల కావాల్సింది.. కానీ..

ఇంట‌ర్నెట్ డెస్క్‌: స‌ముద్ర ఖ‌ని, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్.. కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘ఆకాశవాణి’. రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అడ‌వి నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూన్‌ 4న విడుద‌ల చేయాల‌నుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కానీ, కొవిడ్ సెకండ్ వేవ్ వ‌ల్ల థియేట‌ర్లు తాత్కాలికంగా మూత‌బ‌డ‌టంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ మేర‌కు ట్వీట్ చేసింది చిత్ర బృందం. ‘ప‌రిస్థితులు సాధారణంగా ఉన్న‌ట్లైతే ‘ఆకాశ‌వాణి’ ఈ రోజు నుంచి థియేటర్లలో సంద‌డి చేసివుండేది. ప్ర‌స్తుతం కాలం మ‌నల్ని ప‌రీక్షిస్తోంది. ఇంట్లోనే ఉండి జాగ్ర‌త్తలు తీసుకోవాలి. అంతా బాగున్నాకే ‘ఆకాశవాణి’  ప్ర‌పంచం మిమ్మ‌ల్ని క‌లుస్తుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సంబంధించిన అప్‌డేట్ అందిస్తాం’ అని పేర్కొంది. ప‌ద్మ‌నాభ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కాలభైరవ, సంభాషణలు సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం సురేష్‌ రగుతు, కూర్పు శ్రీకర్‌ ప్రసాద్‌.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని