close

తాజా వార్తలు

Published : 14/01/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాది పాలు-నీళ్ల బంధం: శివబాలాజీ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అందరూ అభిమానులే. సెలబ్రిటీలను షోకు అతిథులుగా పిలిచి తనదైన శైలిలో ఆలీ ఇంటర్వ్యూ చేస్తారు. తాజాగా ఆ షోకు నటులు శివబాలాజీ, మధుమిత జంటగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు ఎలా కలుసుకున్నది. ముందు ఎవరు ప్రపోజ్‌ చేశారన్నది చాలా వివరించారు. శివబాలాజీ తనను ఫ్లర్ట్‌ చేసేవాడంటూ మధుమిత తెలిపారు. అలాగే స్కూల్లో చదువుకునేటప్పుడు శివబాలాజీ ‘అవుట్‌ స్టాండింగ్‌ స్టూడెంట్‌’గా ఎలా మారారు? తొలి సినిమా అవకాశాన్ని ఎలా చేజిక్కుంచుకున్నారనే దానిపై శివబాలాజీ వివరణ ఇచ్చారు. భార్యభర్తల బంధం గురించి వారిద్దరు ఫన్నీగా చెప్పటం, పెళ్లికి ముందు జరిగిన బ్రేకప్‌ గురించి వివరించటం ఆసక్తికరంగా ఉంది. మరి ఆ ఎపిసోడ్‌ చూడాలంటే మాత్రం వచ్చే సోమవారం రాత్రి 9:30 వరకూ ఎదురు చూడాల్సిందే. అప్పటిదాకా ఈ ప్రోమోను చూసి ఎంజాయ్‌ చెయ్యండి!

ఇదీ చదవండి..

ఫస్ట్‌ సిరీస్‌.. లాస్ట్‌ సీన్‌లో సామ్‌..!



Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని