ఏయన్నార్‌ వద్దన్నా ఎన్టీఆర్‌ వదల్లేదు! - anr denines ntr urge to act in dana veera sura karna
close
Published : 31/08/2020 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏయన్నార్‌ వద్దన్నా ఎన్టీఆర్‌ వదల్లేదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌ ‘దాన వీర శూర కర్ణ’ తీయాలనుకుంటున్న రోజులవి. అందులో కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో నటించమని ఏయన్నార్‌ని ఆయన కోరారట. ఎన్టీఆర్‌ని కృష్ణుడిగా చూసిన కళ్లతో తనను జనం చూడలేరనీ, అలాగే తాను కర్ణుడిగా నటిస్తే పాండవులు మరుగుజ్జులుగా కనిపిస్తారని అక్కినేని సున్నితంగా వద్దన్నారట. ఎన్టీఆర్‌ ఊరుకోలేదు.

మరుసటి రోజు ఏయన్నార్‌కి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి పిలుపు వచ్చింది. ‘మీరిద్దరూ కలిసి నటిస్తే జనం తప్పకుండా ఆదరిస్తారు. ఒప్పుకోండి’ అన్నారట జలగం. ఎన్టీఆర్‌కి చెప్పిన సమాధానమే ఆయనకూ చెప్పి ఏయన్నార్‌ అతి కష్టమ్మీద తప్పించుకున్నారట. ఆ చిత్రం తర్వాతా ఎన్టీఆర్‌ పట్టు విడవలేదు. తర్వాతి చిత్రంలో ఏయన్నార్‌ని చాణక్యుడి పాత్రలో చూపించి తన మాట నెగ్గించుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని