అప్పుడే ట్విటర్‌లో చేరతా: అనుష్క - anushka shetty about her twitter account
close
Published : 29/08/2020 09:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడే ట్విటర్‌లో చేరతా: అనుష్క

హైదరాబాద్‌: మహిళా ప్రాధాన్యం చిత్రాలంటే గుర్తొచ్చే నటి అనుష్క. ‘అరుంధతి’లో జేజమ్మగా అలరించినా, ‘బాహుబలి’లో దేవసేనగా కత్తి తిప్పినా తనకే చెల్లింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే, అనుష్క సామాజిక మాధ్యమాల్లో చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టా ద్వారా మాత్రమే అభిమానులకు చేరువగా ఉన్నారు. మరి ట్విటర్‌లోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నిస్తే.. ఆమె సమాధానం ఏంటో తెలుసా?

‘‘నాక్కొంచెం సిగ్గెక్కువే. సెట్లోకి వెళ్తే అన్నీ మర్చిపోతా గానీ, కొత్తవాళ్లతో అంత త్వరగా కలవలేను. సినిమాలు లేకపోతే ఇల్లే నా లోకం. బయట విషయాల గురించి అసలు పట్టించుకోను. ఇక సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండటానికి ప్రత్యేకంగా కారణాలేమీ లేవు. సమయాభావం వల్లే వాటికి దూరంగా ఉంటున్నా. అభిమానులు ట్విటర్‌లోకి రమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నా.. అటు వైపు రాకపోవడానికి ఇదీ ఒక కారణం కావొచ్చు. నిజానికి దీని గురించి నేనింకా అవగాహన పెంచుకోలేదు. ఏదైనా చెప్పాలని నా మనసుకు అనిపించినప్పుడు తప్పక ట్విటర్‌లో చేరతా. ఆ తర్వాత అభిమానులందరితో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటా’’అంటూ చెప్పుకొచ్చింది స్వీటీ.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని