పవన్‌ సినిమాతో ఆనంద్‌సాయి రీఎంట్రీ! - art director ananad sai re entry
close
Updated : 25/02/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ సినిమాతో ఆనంద్‌సాయి రీఎంట్రీ!

హైదరాబాద్‌: మొదటిసారి ఆర్ట్ ‌డైరెక్టర్‌గా ‘తొలిప్రేమ’ చిత్రంలో బీచ్‌లో తాజ్‌మహల్‌ సెట్‌ వేసి అందరిని ఆకర్షించారు ఆనంద్‌సాయి. అలా మొదలైన ఆయన ప్రస్థానం ‘యమదొంగ’ చిత్రంలో యమపురి సెట్‌ను అత్యద్భుతంగా డిజైన్‌ చేయడంతో తారాస్థాయికి చేరింది. ఎన్నో సినిమాల్లో కలర్‌ఫుల్‌ సెట్లతో అలరించిన ఆయన ఐదేళ్ల క్రితం స్థపతిగా మారి యాదాద్రి పుణ్యక్షేత్ర అభివృద్ధి క్రతువులో భాగమయ్యారు. అయితే, తాజాగా మళ్లీ తన ప్రాణమిత్రుడు పవన్‌కల్యాణ్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా ఆనంద్‌సాయి పనిచేయనున్నారు.  ఈ విషయాన్ని మైత్రీ సంస్థ ట్విటర్‌లో తెలిపింది. పవన్‌తో‌ ‘తొలిప్రేమ’ మొదలుకుని తమ్ముడు, ఖుషీ, జల్సా చిత్రాలకు ఆనంద్‌సాయి ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. మరోవైపు పవన్‌కల్యాణ్ వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. త్వరలో ‘వకీల్‌సాబ్‌’ థియేటర్లలోకి రానుండగా, రానాతో కలిసి నటిస్తున్న మరో చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. అలాగే చారిత్రక నేపథ్యంలో డైరెక్టర్‌ క్రిష్‌తో ఒక చిత్రం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని