TS news: సీఎంకు సమస్యలు కనపడలేదా? - bandi sanjay response on cm kcr gandhi visit
close
Published : 21/05/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS news: సీఎంకు సమస్యలు కనపడలేదా?

బండి సంజయ్‌

హైదరాబాద్‌: కరోనా చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. కొవిడ్‌ బారినపడి నిరుపేదలు అల్లాడుతున్నారని, తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు.  సీఎం కేసీఆర్‌ గాంధీ ఆస్పత్రిని సందర్శించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అయితే గాంధీకి వెళ్లిన ఆయన ఏ సమస్యలు పరిష్కరించారో చెప్పాలన్నారు. ఆస్పత్రిలో పూర్తిస్థాయి సౌకర్యాలు లేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారని సంజయ్‌ విమర్శించారు. ‘‘ పీపీఈ కిట్‌ లేకుండా సీఎం ఆస్పత్రికి వెళ్లడం తప్పు. ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన ఆయనకు అక్కడి సమస్యలు కనబడలేదా? గాంధీలో టెక్నీషియన్లు, వెంటిలేటర్ల కొరత ఉంది. వైద్యులు, ఇతర సిబ్బంది సమస్యలు సీఎం ఎందుకు వినలేదు’’ అని బండి ఆరోపించారు. ప్రజల ఆర్తనాదాలు ఆయనకు వినిపించడం లేదన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని