బెంగాల్‌ భాజపాను కోరుకుంటోంది: మోదీ - bengal wants bjp sarkar says modi
close
Updated : 24/03/2021 14:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌ భాజపాను కోరుకుంటోంది: మోదీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ మేరకు ఆయన బెంగాల్‌లోని కొంటాయిలో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ ‘బెంగాల్‌ ఛాహియే భాజపా సర్కార్‌’(బెంగాల్‌ ప్రజలు భాజపాను కోరుకుంటున్నారు)అంటూ నినాదాన్ని ఇచ్చారు.

‘బెంగాల్‌లో తొలిసారి ఓటు వినియోగించుకునే యువతకు ఈ సమయం ఎంతో కీలకమైనది. రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే బాధ్యత వారి చేతుల్లోనే ఉంది. బెంగాల్‌ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది. ఈ రాష్ట్ర‌ భవిష్యత్తు కోసం మేం ఎంతైనా శ్రమించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని మోదీ వెల్లడించారు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ మోదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైన రిలీఫ్‌ ఫండ్‌ను దీదీ ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఆంఫన్‌ తుఫాను బాధితులను ఆదుకోవడానికి కేంద్రం నుంచి నిధులు ఇస్తే.. వాటిని దీదీ తన మేనల్లుడికి కట్టబెట్టారు. మే 2వ తేదీన బెంగాల్లో దీదీ పాలన పోతుంది.. అప్పుడు రాష్ట్రంలో నిజమైన మార్పు వస్తుంది’ అని దీదీపై మోదీ విమర్శలు చేశారు.

బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మార్చి 27న తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని