భాజపా విజయం ట్రైలర్‌ మాత్రమే - bypoll results in gujarath
close
Published : 10/11/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భాజపా విజయం ట్రైలర్‌ మాత్రమే

గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ

గాంధీ నగర్‌ : గుజరాత్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార భాజపా భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక్కడ ఉప ఎన్నికలు జరిగిన 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసే విధంగా ఆధిక్యంలో కొనసాగుతోంది. నవంబర్‌ 3న ఇక్కడ ఉప ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 81 మంది అభ్యర్థులు పోటీపడగా..60.75 శాతం పోలింగ్‌ నమోదైంది.

అబ్దాసా, దాంగ్స్‌, ధారీ, గధాడా, కప్రాడా, కర్జాన్‌, మోర్బీ, లింబ్డీ స్థానాల్లో భాజపా అభ్యర్థులు తొలి నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒక్క మోర్బీలోనే కాంగ్రెస్‌, భాజపాల మధ్య ఆధిక్యంలో స్వల్ప తేడా ఉంది.

ఇక ఈ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారీ విజయమని.. వచ్చే ఎన్నికలకు ఇది ట్రైలర్‌ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ‘వచ్చే శాసనసభ ఎన్నికలకు ఈ విజయం ఓ ట్రైలర్‌ మాత్రమే. కాంగ్రెస్‌ ఓ మునిగిపోతున్న నావ. ప్రతిచోట వారిని ప్రజలు తిరస్కరిస్తున్నారు’ అని రూపానీ అన్నారు. గుజరాత్‌లో 2022లో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని