జగన్‌, విజయసాయి వాదనలకు సిద్ధం కావాలి: సీబీఐ కోర్టు - cbi court hearing on jagan illegal assets case
close
Updated : 28/07/2021 20:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌, విజయసాయి వాదనలకు సిద్ధం కావాలి: సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో అభియోగాల నమోదుపై వాదనలు వినిపించేందుకు సిద్ధం కావాలని జగన్‌, విజయసాయిరెడ్డిని కోర్టు ఆదేశించింది. విశ్రాంత ఐఏఎస్‌ శామ్యూల్‌ డిశ్ఛార్జి పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది.

ఈడీ కేసులను మొదట విచారణ జరపాలా? వద్దా? అనే అంశంపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందని విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. అప్పటి వరకు వాయిదా వేయాలన్న అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం విచారణను ఆగస్టు 6కి వాయిదా వేసింది. ఎమ్మార్‌ అక్రమాలపై సీబీఐ, ఈడీ కేసులపై విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని