మహేశ్‌ ఈజ్‌బ్యాక్‌.. సుధీర్-విష్ణుప్రియ డ్యాన్స్‌‌ - celebrities social media round up
close
Published : 10/09/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ ఈజ్‌బ్యాక్‌.. సుధీర్-విష్ణుప్రియ డ్యాన్స్‌‌

ఘట్టమనేని గార్డెన్‌.. ‘బద్రి’ రోజుల్లోకి రేణు..

హైదరాబాద్‌: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇన్నాళ్లూ సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లకు హాజరౌతున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ తిరిగి మేకప్‌ వేసుకుని, సెట్‌లో అడుగుపెట్టారు. ఓ వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారు. బుధ, గురువారం హైదరాబాద్‌లో దీనికి సంబంధించిన షూటింగ్‌ జరగనుంది. మరోవైపు ఘట్టమనేని మంజుల తన ఇంటి ఆవరణలో పెరుగుతున్న చెట్లను చూపించారు. కూరగాయలు, పండ్ల చెట్లను పెంచుతున్నామని, ఇవి ఆనందంతోపాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అందరూ ఇలానే వీలైనన్ని చెట్లను పెంచాలని కోరారు.

సెప్టెంబరు 9 రేణూ దేశాయ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజట. 25 ఏళ్ల క్రితం సరిగ్గా ఇవాళే ఆమె తొలిసారి కెమెరా ముందు నిల్చున్నారు. 16 ఏళ్లకే నటిగా మారానని, తొలి సినిమా సెట్‌లోనే ప్రేమలోపడ్డానని ఆమె ఇన్‌స్టాగ్రాలో పాత ఫొటోలు షేర్‌ చేసి, గుర్తు చేసుకున్నారు. శాస్త్రవేత్త అవ్వాలనుకుని, చిత్ర పరిశ్రమకు వచ్చానని తెలిపారు. ఇలా మన తారలు తాజాగా సోషల్‌మీడియాలో షేర్‌ చేసిన ఆసక్తికరమైన విశేషాలు చూద్దాం..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని