నాని విన్నపం.. ‘రణం’ హీరోయిన్‌ డ్యాన్స్‌ - celebrities social media round up
close
Published : 29/10/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాని విన్నపం.. ‘రణం’ హీరోయిన్‌ డ్యాన్స్‌

సోషల్‌లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు..

* మనం ఉపయోగించకుండా పక్కన పెట్టిన బొమ్మలు, పుస్తకాలు, ఇతర వస్తువుల్ని విరాళంగా ఇవ్వమని కథానాయకుడు నాని కోరారు. సహాయ ఆర్గనైజేషన్‌ గురించి ఫాలోవర్స్‌కు తెలిపారు. మనం చేసే ఈ చిన్న పని పేద పిల్లల సంతోషానికి కారణమౌతుందని పేర్కొన్నారు.

* మాలీవుడ్‌ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘చెక్’ చిత్ర బృందం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది. నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్‌ ట్విటర్‌లో పోస్టర్‌ను షేర్‌ చేసింది. నితిన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా వారియర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది.

* నటి కృతి కర్బందా తన సహ నటుడు పుల్కిత్‌ సామ్రాట్‌ ఛాలెంజ్‌ స్వీకరించారు. పోల్‌ సాయంతో విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

* మరో రెండు రోజుల్లో నటి కాజల్‌ వివాహం జరగబోతోంది. మరో ఇంటి కోడలు కాబోతున్న తన సోదరితో నిషా అగర్వాల్‌ ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో తీసిన ఫొటోల్ని కాజల్‌ షేర్‌ చేశారు.

* కరోనా వచ్చిన తర్వాత దాన్నుంచి కోలుకోవడానికి ప్రయత్నించడం కన్నా.. ముందే జాగ్రత్తగా ఉండటం మేలని నటుడు రణ్‌దీప్‌ హుడా అంటున్నారు. తన తర్వాతి సినిమా సెట్‌లో అడుగుపెట్టడానికి ముందు కరోనా పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు.

* ‘రణం’, ‘బెండు అప్పారావ్‌’ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన నటి కామ్నా జఠ్మలానీ మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. తన పిల్లలతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు.















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని