మనవడితో బాలయ్య.. మంచులక్ష్మి సలహాలు - celebrities social media round up
close
Published : 12/11/2020 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మనవడితో బాలయ్య.. మంచులక్ష్మి సలహాలు

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు

* కథానాయకుడు మహేశ్‌ బాబు ‘ఉప్పెన’ సినిమాలోని ‘రంగులద్దుకున్న..’ పాటను విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా ఇది. కృతి శెట్టి కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు బాణీలు అందించారు.

* నందమూరి బాలకృష్ణ తన మనవడు ఆర్యవీర్‌తో కలిసి దిగిన చక్కటి ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. బాబు.. బాలయ్య రెండో కుమార్తె తేజస్వి కుమారుడు.

* నటి మంచు లక్ష్మి తన ఫాలోవర్స్‌కు కోపం తగ్గించుకునే టిప్స్‌ చెప్పారు. షూటింగ్‌ సమయంలో తనకు ఎంతో విసుగు, కోపం వచ్చిందని.. థియేటర్‌ రూమ్‌లోకి వచ్చి ఇలా చేసిన తర్వాత ఎంతో ప్రశాంతంగా అనిపించిందని వివరించారు.

* తన సోదరి కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి వేడుకలు పూర్తైన భావన రావడం లేదని నటి నిషా అగర్వాల్‌ అంటున్నారు. ఇంకా పండగ వాతావరణంలో ఉన్నట్లు చెప్పారు. తన సోదరితో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేశారు.

* రవితేజ, శ్రుతి హాసన్‌ జంటగా నటిస్తున్న సినిమా ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోందని రవితేజ తెలిపారు. కొత్త పోస్టర్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని