Tollywood: అలరిస్తోన్న ‘చరిత కామాక్షి’ ఫస్ట్‌లుక్‌ - charitha kaamakshi first look trending on social media
close
Updated : 23/07/2021 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: అలరిస్తోన్న ‘చరిత కామాక్షి’ ఫస్ట్‌లుక్‌

హైదరాబాద్‌: రొమాంటిక్‌ ఇంటెన్స్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘చరిత కామాక్షి’. నవీన్‌, దివ్య శ్రీపాద కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చందు సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. ‘చరిత కామాక్షి’ అనే టైటిల్‌ అందరి దృష్టి ఆకర్షిస్తోందని వివరించింది. యువతతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీర్చిదిద్దినట్లు దర్శకుడు సాయి తెలిపారు. ఫైర్‌ఫ్లై ఆర్ట్స్ బ్యాన‌‌ర్‌పై ర‌జ‌నీరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అబు స్వరాలు సమకూరుస్తున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని