ఏప్రిల్‌లో అన్ని రోజులూ టీకా పంపిణీ - covid vaccination throughout april including gazetted holidays at all public pvt sector centres
close
Published : 01/04/2021 14:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏప్రిల్‌లో అన్ని రోజులూ టీకా పంపిణీ

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ నెలలో అన్ని రోజులూ టీకా పంపిణీ కొనసాగుతుందని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ‘‘ఏప్రిల్‌ మొత్తం వ్యాక్సినేషన్‌ కొనసాగుతుంది. గెజిటెడ్‌ సెలవు రోజుల్లోనూ టీకా అందజేస్తాం’’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ వ్యాక్సిన్ కేంద్రాల్లో ప్రతి రోజూ వ్యాక్సినేషన్‌ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్న కేంద్రం.. ఇందుకోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అత్యంత వేగంగా ఎక్కువ మందికి టీకాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 

దేశంలో గత కొద్దిరోజులుగా కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఏప్రిల్‌ 1 నుంచి 45ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ చేపట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అంతేగాక, టీకాలు వచ్చాయని ప్రజల్లో వైరస్‌ పట్ల నిర్లక్ష్యం తగదని హెచ్చరించిన ప్రభుత్వం.. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దేశంలో జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ మొదలైంది. ఇప్పటి వరకు 6.5కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

దేశంలో గడిచిన 24 గంటల్లో 72వేల పైన కొత్త కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబరు తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. మరణాల సంఖ్య కూడా తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్‌ ఆందోళనకర రీతిలో ఉంది. దీంతో పాటు కర్ణాటక, పంజాబ్‌, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ కేసులు పెరిగిపోతున్నాయి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని