1200 కేంద్రాల్లో విజయవంతంగా కొవిడ్‌ డ్రైరన్‌ - covid vaccine dry run in telangana state
close
Published : 09/01/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

1200 కేంద్రాల్లో విజయవంతంగా కొవిడ్‌ డ్రైరన్‌

హైదరాబాద్‌: కొవిడ్‌ టీకా ముందస్తు సన్నాహకాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాల్లో శుక్రవారం కొవిడ్‌ డ్రైరన్‌ నిర్వహించారు. కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ పనితీరు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సన్నద్ధత తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి కేంద్రంలోనూ 25 మందితో డ్రై రన్‌ నిర్వహించారు. టీకా పంపిణీ కోసం ప్రతి కేంద్రంలోనూ వెరిఫికేషన్‌, వ్యాక్సినేషన్‌, అబ్జర్వేషన్‌ గదులను ఏర్పాటు చేశారు. టీకా వికటిస్తే ఎదుర్కొనేందుకు అవసరమైన మందులు, వైద్యుల్ని సైతం అందుబాటులో ఉంచారు. డ్రైరన్‌ ముగిసిన తర్వాత మండల స్థాయి కమిటీ సమావేశాల్లో క్షేత్రస్థాయి సమస్యలను చర్చించనున్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. 

నల్గొండలో విజయవంతం..
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా డ్రైరన్‌ విజయవంతంగా సాగింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 61 కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఆయా జిల్లా కలెక్టర్లు ఆస్పత్రుల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులతోపాటు పీహెచ్‌సీల్లోనూ డ్రైరన్‌ నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఐదు, సూర్యాపేటలో 31, యాదాద్రి జిల్లాలో 25 చోట్ల డ్రైరన్‌ సాగింది. 

అనుమతి రాగానే ప్రతి ఒక్కరికీ టీకా 

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైరన్‌ విజయవంతంగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు మొత్తం 95 కేంద్రాల్లో డ్రైరన్‌ నిర్వహించారు. ఒక్కో కేంద్రానికి 25 మంది చొప్పున 2,375మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో డ్రైరన్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. జిల్లాలో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 11 పీహెచ్‌సీ కేంద్రాల్లో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ అందించినట్లు చెప్పారు. టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడంతోపాటు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. డ్రైరన్‌లో గమనించిన సాంకేతిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని కలెక్టర్‌ వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రతి ఒక్కరికీ టీకా అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఇవీ చదవండి..
దేశంలో 82 కరోనా కొత్తరకం కేసులు

చిగురుటాకులా వణుకుతున్న అగ్రరాజ్యం
 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని