ప్లీజ్‌ డాడీ.. నేరుగా ఇంటికే వచ్చేయండి - david warner daughters sent an emotional message to his father comeback after ipl suspension
close
Published : 05/05/2021 02:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్లీజ్‌ డాడీ.. నేరుగా ఇంటికే వచ్చేయండి

డేవిడ్‌ వార్నర్‌కు కుమార్తెల విన్నపం..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడడంతో విదేశీ క్రికెటర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ స్వస్థలాలకు ఎలా వెళ్లాలనే విషయంపై సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు విమాన రాకపోకలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా ఆటగాళ్లకు ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు తన ముద్దుల కుమార్తెల నుంచి తాజాగా ఓ అపురూపమైన, భావోద్వేగపూరితమైన సందేశం వచ్చింది. దాన్ని వార్నర్‌ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు.

‘‘ప్లీజ్‌ డాడీ.. ఎక్కడికి వెళ్లకుండా నేరుగా ఇంటికే వచ్చేయండి. నిన్ను చాలా మిస్‌ అవుతున్నాం. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం. మీ.. ఇవీ, ఇండి, ఇస్లా’’ అని ముగ్గురు కూతుర్లూ ఒక కాగితంపై తమ కుటుంబాన్ని పోలిన అందమైన డ్రాయింగ్‌ గీసి ఆ ఫొటోను వార్నర్‌కు పంపారు. దాన్ని ఆస్ట్రేలియా క్రికెటర్‌ అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. ఆ చిన్నారులు గీసిన చిత్రం ఎంతో ముచ్చటగా ఉండటమే కాకుండా తండ్రిపై తమకున్న ప్రేమను తెలియజేస్తుంది. దీనికి అభిమానుల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత సీజన్‌లో వార్నర్‌ నాయకత్వంలో సన్‌రైజర్స్‌ ఆరు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే సన్‌రైజర్స్‌ అతడిని ఏడో మ్యాచ్‌కు ముందు కెప్టెన్సీ నుంచి తొలగించి కేన్‌ విలియమ్సన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు లీగ్‌లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో వార్నర్‌ను ఇంటికి వచ్చేయమని అతని కూతుర్లు ఇలా ప్రేమను వ్యక్తపరిచారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని